తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తండ్రిగా ప్రమోషన్​ పొందిన అనిల్ రావిపూడి - మహేశ్ బాబు

టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఈ విషయాన్ని సూపర్​స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు.

ani
అనిల్

By

Published : Jan 5, 2020, 11:16 AM IST

వరుస విజయాలతో టాలీవుడ్​లో సక్సెస్​ఫుల్ డైరెక్టర్​గా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. ఇతడు దర్శకత్వం వహించిన 'సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతి కానుకగా విడుదలవనుంది. అయితే అంతకంటే ముందే రావిపూడి ఇంట్లో పండగ వాతావరణం చోటుచేసుకుంది. ఇందుకు కారణం ఇతడు తండ్రిగా ప్రమోషన్​ పొందడమే. అనిల్ సతీమణి నేటి ఉదయం పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు.

ప్రస్తుతం మహేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'సరిలేరు నీకెవ్వరు' ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు ఎల్బీ స్టేడియం వేదికగా ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రానున్నాడు.

దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రష్మిక మందాణ్న హీరోయిన్. విజయశాంతి కీలకపాత్ర పోషించింది.

ఇవీ చూడండి.. 'డిస్కోరాజా' ప్రీరిలీజ్ వేడుక ఎప్పుడంటే..!

ABOUT THE AUTHOR

...view details