తెలంగాణ

telangana

By

Published : Aug 15, 2020, 8:58 PM IST

ETV Bharat / sitara

'అంధాదున్'​లో కీలక పాత్రకు నయనతార నో?

బాలీవుడ్​ సినిమా 'అంధాధున్'​ తెలుగు రీమేక్​లో ఓ కీలక పాత్ర కోసం చిత్రబృందం హీరోయిన్​ నయనతారను సంప్రదించిందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆ ఆఫర్​ను నయన్​ తిరస్కరించిందని సమాచారం.

nayanatara
అంధాదున్​లో కీలక పాత్రకు నయనతార నో!

తెలుగు నటుడు నితిన్.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హిందీలో వచ్చిన 'అంధాధున్'‌ చిత్రానికి రీమేక్​లో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం చిత్రబృందం నయనతారను సంప్రదించిందని ఇటీవల వార్తలు జోరందుకున్నాయి. ఇందుకోసం నయన్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిందని సమాచారం. అయితే తాజాగా మళ్లీ ఆ ప్రాత పోషించేందుకు నిరాకరించిదని తెలుస్తోంది. ఆ పాత్రలో తాను కంఫర్ట్​గా నటించలేకపోవడమే కారణమని సినీ వర్గాలు టాక్​. అయితే నయన్​ నుంచి మాత్రం ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు.

బాలీవుడ్‌ 'అంధాదున్'‌ చిత్రంలో టబు ఓ పాత్రలో నటించింది. ఈ పాత్రలోనే నయనతార నటించాల్సి ఉంది. అయితే ఇప్పటికే చిత్రబృందం ఈ పాత్ర కోసం పలువురు సీనియర్‌ నటీమణులను కూడా సంప్రదించింది. కానీ ఇంకా ఎవరినీ ఖరారు చేశారో అధికారికంగా ప్రకటించలేదు.

ఇది చూడండి 'అంధాధున్' రీమేక్​లో నయనతార!

ABOUT THE AUTHOR

...view details