తాను షేర్ చేసిన ఫొటోలు, అభిప్రాయాలపై ఎవరైనా కామెంట్లు చేస్తే నటి అనసూయ వాళ్లపై కౌంటర్ ఎటాక్ చేస్తుంటారు. అలా ట్విటర్, ఇన్‌స్టాలో ఎన్నో సందర్భాల్లో ఆమె ఆగ్రహానికి గురయ్యారు. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడో నెటిజన్‌పై మరోసారి విమర్శలు చేసింది. నెటిజన్ క్షమాపణలు చెప్పినప్పటికీ ఆమె మాత్రం కౌంటర్ సమాధానమిచ్చారు.
సారీ చెప్పినప్పటికీ కౌంటర్ ఇచ్చిన అనసూయ - anasuya movie news
అనసూయ ఫొటోపై నెటిజన్ కామెంట్ చేసి అనంతరం క్షమాపణలు చెప్పినప్పటికీ ఆమె అతడిపై కౌంటర్ వేసింది. ప్రస్తుతం ఈ మీమ్ వైరల్‌గా మారింది.
నటిగా, యాంకర్‌గా, అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్స్‌లో తళుక్కున మెరిస్తూ కెరీర్‌లో దూసుకెళ్తున్న అనసూయ తరచూ తన స్టైలిష్ ఫొటోషూట్స్‌ను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవల లంగా ఓణీలో దిగిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన వాటిల్లో ఓ ఫొటో గురించి తాజాగా ఓ నెటిజన్ స్పందించాడు. 'అ ఆ' సినిమాలోని సమంతతో అనసూయ ఫొటోను పోలుస్తూ.. 'నువ్వు ఏమైనా సమంత అనుకుంటున్నావా?' అంటూ ఓ మీమ్ క్రియేట్ చేశాడు. అది చూసిన అనసూయ.. 'అయ్యో లేదమ్మా.. నన్ను అనసూయ అంటారు' అని జవాబు ఇచ్చింది. అనంతరం సదరు నెటిజన్.. 'క్షమించండి మేడమ్.. ఆట పట్టించడం(Kidding) కోసం నేను సరదాగా అన్నాను' అని రిప్లై ఇవ్వగానే.. 'నాకర్థమైంది నువ్వు(మానసికంగా, బుద్ధిపరంగా అర్థం వచ్చేలా) చిన్నపిల్లాడివేనని('KID'DING). త్వరలోనే నువ్వు ఎదగాలని నేను కోరుకుంటున్నా' అని కౌంటర్ ఇచ్చింది.