తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అలా అనసూయ రంగమ్మత్తగా మారింది - రాశి, అనసూయ

'రంగస్థలం' చిత్రంలో రంగమ్మత్త పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్యారెక్టర్​లో అనసూయకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ పాత్ర ముందు హీరోయిన్​ రాశి చెంతకు చేరిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సీనియర్ నటి నో చెప్పింది.

అనసూయ

By

Published : Nov 21, 2019, 10:47 AM IST

నటులందరికీ వారు పోషించిన పాత్రల్లో కొన్ని మంచి గుర్తింపు తెచ్చిపెడతాయి. మరికొన్ని తమ కెరీర్‌నే మార్చేస్తాయి. నటిగా మారిన టీవీ వ్యాఖ్యాత అనసూయ విషయంలో ఇదే జరిగింది.

అదేంటంటే? సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా వచ్చిన చిత్రం 'రంగస్థలం'. ఇందులో రంగమ్మత్త అనే పాత్ర చాలా ప్రత్యేకమైంది. అప్పటి వరకు అనసూయ పలు చిత్రాల్లో నటించినా.. ఈ పాత్రతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తన కోసమే ఈ పాత్ర పుట్టిందా అన్నట్లు తన నటనతో మైమరపించిన అనసూయకు ఈ పాత్ర రావడానికి కారణం ఓ రకంగా కథానాయిక రాశినే.

రాశి

రాశి, అనసూయకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఉంది. ముందుగా రంగమ్మత్త పాత్ర కోసం చిత్ర బృందం రాశినే సంప్రదించిందట. ఆ పాత్ర కొంచెం బోల్డ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. "పాత్ర మంచిదే అయినా మోకాళ్లపై వరకు చీర కట్టాలి. ఆ లుక్‌ నాకు సరిపోదు. అందుకే రంగమ్మత్తను తిరస్కరించాను" అని చెప్పుకొచ్చింది రాశి. అలా రాశి వద్దనడం వల్ల అనసూయ రంగమ్మత్తగా మారింది.

ఇవీ చూడండి.. 'గీత గోవిందం'లో రకుల్ ఛాన్స్ అలా మిస్​

ABOUT THE AUTHOR

...view details