తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డ్రెస్​పై నెటిజన్ కామెంట్.. అనసూయ కౌంటర్

తన వస్త్రధారణపై కామెంట్ చేసిన ఓ నెటిజన్​కు కౌంటర్ ఇచ్చింది యాంకర్, నటి అనసూయ. పాజిటివ్​గా ఆలోచించలేవా అంటూ మండిపడింది.

Anasuya
నసూయ

By

Published : Apr 23, 2021, 5:18 PM IST

తన ఫొటోషూట్‌ గురించి కామెంట్‌ చేసిన ఓ నెటిజన్‌కు మాటలతో చురకలు అంటించింది యాంకర్, నటి అనసూయ. స్టైలిష్‌ యాంకర్‌గా బుల్లితెరపై ఓ ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన అనసూయ ప్రస్తుతం పలు షోలు, సినిమాల షూటింగ్స్‌తో బిజీ షెడ్యూల్‌ గడుపుతోంది. తాజాగా ఆమె ఓ షూట్‌ కోసం గౌను ధరించి ఫొటోలకు ఫోజులిచ్చింది. అనంతరం సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లతో తన ఫొటోలు పంచుకుంది.

అనసూయ

కాగా పలువురు నెటిజన్లు అనసూయ వస్త్రాధారణ గురించి నెగెటివ్‌ కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్‌.. "‘ఇలాంటి ఫొటోలు పోస్ట్‌ చేయడానికంటే ముందు.. దేశంలో కరోనా కేసులు, మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి కదా దాని గురించి మీకస్సలు బాధ లేదా? నా ఉద్దేశం ఏమిటంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ ఫొటోలు అవసరమా?" అని కామెంట్‌ పెట్టాడు. నెటిజన్‌ కామెంట్‌పై స్పందించిన అను.."ఇలాంటి కఠిన సమయాల్లో కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌, నమ్మకాన్ని కొంతవరకూ అయినా మేము అందిస్తున్నాం. నువ్వు పాజిటివ్‌ కోణంలో ఆలోచించలేవా" అని కౌంటర్‌ ఇచ్చింది.

అనసూయ

అనసూయ ప్రస్తుతం 'ఖిలాడి', 'పుష్ప' చిత్రాలతోపాటు కోలీవుడ్‌లోనూ ఓ సినిమాలో నటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details