యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూనే వెండితెరపైనా మెరుస్తోంది. విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.
తాజాగా హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న 'పక్కా కమర్షియల్' సినిమాలో అనసూయ నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ ఏడాది అక్టోబర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది. రాశీ ఖన్నా, ఈషా రెబ్బా కథానాయకులుగా నటిస్తున్నారు.