తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరో ఐటెంసాంగ్​లో స్టెప్పులేయనున్న అనసూయ! - అనసూయ భరద్వాజ్ వార్తలు

యువ కథానాయకుడు కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం 'చావు కబురు చల్లగా'. ఈ సినిమాలోని ఐటెంసాంగ్​లో బుల్లితెర వ్యాఖ్యాత అనసూయ భరద్వాజ్​ స్టెప్పులేయనుందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

anasuya bharadwaj special dance for karthikeya chaavu kaburu challaga movie
మరో ఐటెంసాంగ్​కు సిద్ధమైన అనసూయ!

By

Published : Jan 29, 2021, 5:45 PM IST

వ్యాఖ్యాతగా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ భరద్వాజ్‌. అక్కడితోనే ఆగిపోకుండా తనలోని డ్యాన్సర్నీ ప్రేక్షకులకు పరిచయం చేశారు. 'విన్నర్‌' చిత్రంలో సాయి తేజ్‌ సరసన చిందేసి వావ్‌ అనిపించుకున్నారు. ప్రస్తుతం అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషిస్తూనే మరోసారి ఐటెమ్‌ సాంగ్‌లో నర్తించేందుకు ఆమె సిద్ధమయ్యారని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న 'చావు కబురు చల్లగా'లో ఓ ప్రత్యేక గీతం ఉందట. అందుకు పలువురి పేర్లు తెరపైకిరాగా అనసూయనే ఫైనల్‌ చేసారంటూ ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని త్వరలోనే స్పష్టత రావచ్చని సినీవర్గాలు అంటున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

'చావు కబురు చల్లగా' సినిమాకు కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బస్తీ బాలరాజుగా కనిపించనున్నాడు కార్తికేయ. ఆసుపత్రిలో పనిచేసే సిస్టర్‌ పాత్ర పోషిస్తుంది లావణ్య. జాక్స్‌ బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇదీ చూడండి:మెగాస్టార్​ 'ఆచార్య' టీజర్​ వచ్చేసిందోచ్​!

ABOUT THE AUTHOR

...view details