తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అనంత' స్వరాలకు ప్రాణం.. 'శ్రీ రాముడి' కలం - తెలుగు సాహిత్యం

సినిమా పాటలను అందరికి అర్ధమయ్యే భాషలో రాస్తూ ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్న రచయిత అనంత శ్రీ రామ్. ముఖ్యంగా ప్రేమ గీతాలతో ఎంతో గుర్తింపు పొందారు. నేడు ఆయన 36వ వసంతంలోకి అడుగుపెట్టనున్నాడు.

'అనంత' స్వరాలకు ప్రాణం.. 'శ్రీ రాముడి' కలం

By

Published : Apr 8, 2019, 6:00 AM IST

'ఇంకేం ఇంకే ఇంకేం కావాలే...' అనగానే మిగతా పాట మొదలవకుండా తమ గొంతు కలుపుతుంది యువత. 'నిజంగా నేనే నా'.. అంటే కొత్త బంగారు లోకాన్ని ఊహాల్లో ఊహించికుంటుంది. ' నమ్మవేమో గానీ'.. 'ఈ హృదయం కరిగించే వెళ్లకే'... అంటే తమ ప్రియమైన వారిని తలచుకుంటుంది.. ఈ పాటలకు గాత్రం వేరైనా.. ఆ గొంతు వెనక మాటకు ప్రాణం పోసింది మాత్రం ఒక్కరే. ఆయనే అనంత శ్రీరామ్. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలు చూద్దాం!

అనంత శ్రీరామ్
  • కుటుంబ నేపథ్యం..

1984 ఏప్రిల్ 8న పశ్చిమగోదావరి జిల్లా దొడ్డిపట్లలో జన్మించారుఅనంత శ్రీరామ్. 12 ఏళ్ల వయసు నుంచే సాహిత్యంపై అభిరుచి పెంచుకున్నారు. అప్పటి నుంచే పాటలు పద్యాలు రాయడం మొదలుపెట్టారు. తండ్రి సీవీవీ సత్యనారాయణ ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి సాహిత్యం వైపు దృష్టి సారించారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చేస్తూ మూడో ఏడాదిలోనే చదువు మానేశారు. అనంతరం సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

  • సినీ ప్రయాణం...

‘ఔననిలే’ చిత్రంతో పరిశ్రమకి పరిచయమయ్యారుఅనంతశ్రీరామ్‌. అందరివాడు సినిమాలో 'ఓ పడుచు బంగారమా' పాటతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ గేయంతో మెగాస్టార్ చిరంజీవి నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు.

  1. స్టాలిన్‌’, ‘పరుగు’, ‘ఆకాశమంత’, ‘మున్నా’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ‘బృందావనం’, ‘చందమామ’, ‘కొత్తబంగారులోకం’, ‘సత్యమేవ జయతే’, ‘అరుంధతి’, ‘ఏమాయ చేసావె’... ఇలా వరుసగా గీతాలు రాస్తూ విజయాల్ని సొంతం చేసుకొన్నారు.
  2. బాహుబలి చిత్రంలో పచ్చబొట్టేసినా పాటతో అందరిని ఆకట్టుకున్నారు. ఇటీవల గీతగోవింద సినిమాలో 'ఇంకే ఇంకే ఇంకే కావాలే' గీతం ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది.
  • 850 గీతాలు రాసిన శ్రీ రామ్..

అందరికీ అర్థమయ్యే భాషలో, మంచి భావంతో రాస్తూ.. ప్రేక్షకుల ఆదరాభిమానాలను సంపాదించుకున్నారు అనంత శ్రీరామ్. ఎ.ఆర్‌.రెహమాన్, ఇళయరాజా, ఎం.ఎం.కీరవాణి వంటి అగ్ర సంగీత దర్శకుల చిత్రాలకు ఎక్కువగా పాటలు రాశారు. పద్నాలుగేళ్ల సినీ ప్రయాణంలో ఆయన దాదాపుగా 850 పైచిలుకు గీతాల్ని రాశారు. ‘సాక్ష్యం’ చిత్రంలో ఓ కీలక పాత్రలో కూడా మెరిశారు అనంత శ్రీరామ్​.

ABOUT THE AUTHOR

...view details