ఆర్జీవీ 'మర్డర్' చిత్రంపై అమృత వ్యాఖ్యల పేరిట పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న కథనాల గురించి తాజాగా ఆమె మామయ్య బాలస్వామి స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ఇప్పటివరకూ 'మర్డర్' సినిమా గురించి ఆమె ఏవిధంగానూ స్పందించలేదని తెలిపారు. ఆమె పేరుతో వస్తోన్న స్టేట్‌మెంట్స్‌ను నమ్మవద్దని అన్నారు.
'ఆర్జీవీ 'మర్డర్' సినిమాపై అమృత స్పందించలేదు' - రామ్ గోపాల్ వర్మ సినిమాపై అమృత
ఆర్జీవీ 'మర్డర్' చిత్రంపై అమృత ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆమె మామయ్య బాలస్వామి స్పష్టం చేశారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు.
అమృత
నిజ జీవితంలో జరిగిన ఓ కథను ఆధారంగా చేసుకుని రూపొందనున్న 'మర్డర్' చిత్రానికి ఆనంద్ చంద్రా దర్శకత్వం వహించనున్నారు. రామ్‌గోపాల్ వర్మ చిత్రంగా నిర్మితం కానున్న ఈ సినిమాకు నట్టి రుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. అయితే, ఆదివారం ఫాదర్స్‌డే సందర్భంగా 'మర్డర్' సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు.