తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమితాబ్ ద్విభాషా  చిత్రం హిందీ టైటిల్ ఖరారు - ఉయరత్న మణిదన్

అమితాబ్ బచ్చన్ ద్విభాషా చిత్రానికి హిందీలో 'తేరా యార్ హూన్ మైన్' అనే టైటిల్​ను నిర్ణయించారు. ఆయనకి జోడిగా రమ్యకృష్ణ నటిస్తోంది.

అమితాబ్ బచ్చన్ ద్విభాషా చిత్రానికి హిందీలో 'తేరా యార్ హూన్ మైన్' టైటిల్

By

Published : Apr 8, 2019, 2:15 PM IST

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తమిళంలో తొలిసారిగా 'ఉయరత్న మణిదన్' సినిమాలో నటిస్తున్నాడు. హిందీలోనూ విడుదల కానుందీ చిత్రం. టైటిల్​ను 'తేరా యార్ హూన్ మైన్'గా చిత్రబృందం నిర్ణయించింది.

ఎస్.జె.సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా ముంబయి పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. అమితాబ్​కు జోడిగా రమ్యకృష్ణ నటిస్తోంది. ఈ చిత్రానికి తమిళవనం దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన బిగ్​బి ఫొటోలు అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఎస్​.జె .సూర్యతో అమితాబ్

ఇదే కాకుండా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న 'బ్రహ్మాస్త్ర'లోనూ నటిస్తున్నాడు అమితాబ్. సినిమాలోని ఇతర పాత్రల్లో రణ్​బీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జున కనిపించనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details