తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పాప్​స్టార్​ పాత్ర చేయలేకపోయాను: అమితాబ్

ఎలాంటి క్లిష్టమైన పాత్రనైనా, వెండితెరపై అవలీలగా నటించగలిగే బిగ్​ బీ అమితాబ్​ బచ్చన్​.. ఓ పాప్​స్టార్​ పాత్రను పోషించడంలో మాత్రం విఫలమయ్యారట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఇంతకీ దాని వెనుకున్న కథేంటి?

Amitabh Bachchan Thinks He Was A 'Failure' At Replicating Michael Jackson
పాప్​స్టార్​ పాత్ర పోషించడంలో విఫలమయ్యా: బిగ్​ బీ

By

Published : Dec 29, 2020, 5:53 PM IST

మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ నటించని పాత్ర లేదనడంలో అతిశయోక్తి లేదేమో! వందల సినిమాల్లో విలక్షణ పాత్రలు ఎన్నో పోషించారు. ఎలాంటి రోల్​ అయినా సరే పరకాయ ప్రవేశం చేస్తుంటారు. ఆయన సినిమాలు కొన్ని విజయం సాధించికపోయినా నటన పరంగా మాత్రం బిగ్​బీ ప్రశంసలు అందుకున్నారు. అలాంటి ఈ కథానాయకుడు.. ఓ పాప్‌ స్టార్‌ పాత్ర పోషించడంలో విఫలమయ్యానని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

అసలు విషయం ఏంటంటే?

దర్శకుడు మన్మోహన్‌ దేశాయ్‌.. 1988లో 'గంగా జమున సరస్వతి' చిత్రం తీశారు. అమితాబ్‌, మిథున్‌ చక్రవర్తి, జయప్రద హీరోహీరోయిన్లు. 'ఈ సినిమాలో పాప్‌ సింగర్‌ మైకేల్‌ జాక్సన్‌గా కనిపిస్తానని భావించారు కానీ నేను ఆ విషయంలో ఫెయిల్‌ అయ్యాను' అంటూ జాక్సన్‌ గెటప్‌లో ఉన్న ఓ ఫొటోను ఇన్​స్టాలో పంచుకున్నారు అమితాబ్‌. దీన్ని చూసిన నెటిజన్లు, అభిమానులు, సినీ తారలు కామెంట్లు పెడుతున్నారు. 'దీన్ని మేం తిరస్కరిస్తున్నాం, ఇప్పటికీ మీరు ది బెస్ట్‌, సూపర్‌ ఫొటో' అంటూ ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుతున్నారు. అంతేకదా మరి అమితాబ్‌ విఫలమవడం ఏంటి???

అమితాబ్​ ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​

ABOUT THE AUTHOR

...view details