బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. అమితాబ్‌తో పాటు ఆయన కుమారుడు, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌కూ వైరస్ సోకింది. ఈ విషయాన్ని అమితాబ్, అభిషేక్ స్వయంగా వెల్లడించారు.
బిగ్ బీ, అభిషేక్‌కు కరోనా- ఆసుపత్రికి తరలింపు - అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు ఈ బాలీవుడ్ నటులు. ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రశాంతంగా ఉండాలని అభిమానులను కోరారు.
బిగ్ బీ, అభిషేక్
ఈ విషయమై సంబంధిత అధికారులకు సమాచారం అందించామని తెలిపాడు అమితాబ్. అనంతరం కుటుంబ సభ్యులతో పాటు సిబ్బందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు ఈ బాలీవుడ్ నటులు. ఇంకా ఫలితాలు రావాల్సి ఉందని స్పష్టం చేశారు. చికిత్స నిమిత్తం ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చేరారు.
అభిమానాలు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రశాంతంగా ఉండాలని కోరాడు అభిషేక్.
Last Updated : Jul 12, 2020, 12:56 AM IST