తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమితాబ్, ఆయుష్మాన్ సినిమా వాయిదా - gulabo sitabho

అమితాబ్, ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న 'గులాబో సితాబో' చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్​ 24న విడుదల కానుంది. ఈ సినిమాకు షుజిత్ సర్కార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

అమితాబ్ - ఆయుష్మాన్

By

Published : Jun 8, 2019, 8:31 AM IST

అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా కలిసి నటిస్తున్న చిత్రం 'గులాబో సితాబో'. తాజాగా ఈ సినిమా 2020 ఏప్రిల్​ 24న విడుదల కానున్నట్టు చిత్రబృందం తెలిపింది. షుజిత్ సర్కార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని మొదట ఈ ఏడాది నవంబరులో విడుదల చేయాలనుకున్నారు.

'విక్కీడోనర్' చిత్రంతో ఆయుష్మాన్ ఖురానా హీరోగా బాలీవుడ్​లో అరంగేట్రం చేశాడు. ఈ సినిమాను షుజిత్​ సర్కార్ తెరకెక్కించాడు. అమితాబ్​తో షుజిత్ 'పీకూ' సినిమాను తీశాడు. ఈ రెండు చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం అమితాబ్​, ఆయుష్మాన్​ కలిసి నటించే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

హాస్య ప్రధానంగా సాగనున్న 'గులాబో సితాబో' చిత్రానికి జూహీ చతుర్వేది కథను అందించాడు. ఇంతకు ముందు షుజిత్ తెరకెక్కించిన 'విక్కీడోనర్', 'పీకూ', 'అక్టోబర్'​ చిత్రాల కథను జూహీనే రాశాడు. గులాబో సితాబో చిత్రాన్ని రోనీ లాహిరి, షీల్ కుమార్ నిర్మిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details