అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. మైనస్ 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న లద్దాఖ్ ప్రాంతంలో షూటింగ్‌కు వెళ్లి వచ్చినట్లు ఫేస్బుక్ వేదికగా పేర్కొన్నారు. దీనిపై స్పందించిన నెటిజన్లు బిగ్‌బీని ప్రశంసించారు. ఆరోగ్యంపైనా శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
"లద్దాఖ్ వెళ్లి వచ్చాను. -33 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఈ చలి నుంచి నన్ను ఏదీ కాపాడలేదు అని అనిపించింది"
-అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ నటుడు.