హీరో సుశాంత్ మరణం తర్వాత బంధుప్రీతి గురించి చిత్రపరిశ్రమ, సోషల్మీడియాలలో పెద్ద చర్చ నడుస్తోంది. ఈ విషయంపై సంగీత దర్శకుడు, గాయకుడు అమిత్ త్రివేది తాజాగా స్పందించాడు. బంధుప్రీతి, స్వాభిమానం లాంటి అంశాలు నటీనటుల మధ్య తప్ప సంగీత ప్రపంచంలో లేవని స్పష్టం చేశాడు.
"బంధుప్రీతి అనేది ఓ వ్యర్థమైన అంశం. ప్రస్తుతం ఈ విషయం వల్ల ప్రజలు తమ అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. బంధుప్రీతి అనేదే లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు హీరో, హీరోయిన్ల మధ్య ఉండొచ్చు. ఎవరి కొడుకు దర్శకుడు లేదా సంగీత దర్శకుడు, గాయకుడు అయ్యాడనే విషయం గురించి ఏ తండ్రి బాధపడటం లేదు. కానీ ఈ ప్రశ్నను నటీనటులను మాత్రమే అడగాలి. వారు తప్ప మరెవ్వరూ బాధ పడటం లేదు. నాకు అలాంటి బాధలేదు. సంగీత ప్రపంచంలో బంధుప్రీతికి, స్వాభిమానాలకు తావులేదు"
- అమిత్ త్రివేది, సంగీత దర్శకుడు