బాలీవుడ్ నటి సన్నీ లియోనీ.. ఈ లాక్డౌన్ సమయంలో అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమైంది. 'లాక్డ్ అప్ విత్ సన్నీ' పేరుతో డిజిటల్ లైవ్ చాట్ షోను నేటి(గురువారం) నుంచి ప్రారంభించింది. ప్రతిరోజూ మధ్యాహ్నం ఓ సెలబ్రిటీతో వివిధ విషయాల గురించి చర్చిస్తానని తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. 38 ఏళ్ల యూట్యూబర్ అనీషా దీక్షిత్‌తో తొలిరోజు ముచ్చటించిందీ భామ.
"ఇన్‌స్టాలో నెటిజన్లు, నా అభిమానుల కోసమే ఈ చాట్ షోను మొదలుపెట్టా. ఇందులో చిన్న చిన్న సంభాషణలు, హాస్యభరిత విషయాలు, అతిథి గురించి చర్చిస్తాం" -సన్నీ లియోనీ, నటి