తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అభిమానిగా అమల... మన్మథుడికి ప్రేమలేఖ

టాలీవుడ్​ మన్మథుడు నాగార్జునకు ప్రేమలేఖ రాశారు ఆయన భార్య అమల. ఓ అభిమానిగా నాగ్​ను ఎంత‌గా ఆరాధిస్తున్నారో అందులో వివరించారామె. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్​ చేశారు.

అభిమాని పాత్రలో అమల... మన్మథుడికి ప్రేమలేఖ

By

Published : May 26, 2019, 3:16 PM IST

కింగ్​ నాగార్జున వెండితెరపై అరంగేట్రం చేసి ఈ ఏడాది మే 23 నాటికి 33ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయనను ఓ సాధారణ అభిమానిగా ఎంతగా ప్రేమిస్తున్నారో వెల్లడించారు ఆయన భార్య అమల.

" నా హీరో, నా భర్త, నా స్నేహితుడా.. నువ్వు నీ కాళ్ల మీద నువ్వు నిలబడ్డావు. నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగావు. నువ్వు తెర మీద కనిపిస్తే చాలు.. నేను ఇప్పటికీ చూపు తిప్పుకోలేకపోతున్నా. నీ నవ్వు చూడటం కోసం నా గుండె పరితపిస్తూ ఉంటుంది. నీ స్టైల్ ​, నీ కళ్లలోని మెరుపులు మరిచిపోలేను. సంవత్సరాలు గడుస్తున్నా నువ్వు మరింత అందంగా తయారవుతున్నావు.ఎంత కష్టమొచ్చినా భయపడకూడదని.. ప్రతి సవాల్‌ను ధైర్యంతో ఎదుర్కోవాలని చెబుతుంటావు.

ఎప్పుడూ వెనకడుగు వేయొద్దని చెప్తూనే ఒక ఉదాహరణ అవుతావు. ప్రతిసారీ.. నువ్వు నటించే సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటాను. ఈసారి ఎలా తెరపై కనిపిస్తావో అని చాలా ఆతృతగా వేచిచూస్తా. మిస్టరీనా? రొమాన్సా? యాక్షన్‌తో కూడిన కామెడీనా? లేక ఆధ్యాత్మికమా? అని నేను ఎదురుచూస్తా.

వేంకటేశ్వరస్వామి, రాముడు, షిరిడీ సాయిబాబాను దర్శించుకునే భాగ్యాన్ని నువ్వు నాకు కల్పించావు. ఇప్పుడు వాళ్లు మన కుటుంబంలో భాగమయ్యారు.
ప్రతిభ గల వ్యక్తులను ప్రోత్సహిస్తావు. నీ బెస్ట్‌ను నువ్వు ఇస్తూ.. ఎప్పుడూ సిగ్గు పడవు. నీ నిర్మాతలకు కష్టాలను రానివ్వవు. నువ్వే నా మ్యాజిక్. 33 ఏళ్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నువ్వు 95 సినిమాలతో ఏదో మాయ చేశావు. అందుకు నీకు అభినందనలు. ఇలాగే ఇంకా ఎన్నో దశాబ్దాలు క్లింట్ ఈస్ట్‌వుడ్, బచ్చన్, ఏఎన్‌ఆర్‌లా సినిమాల్లో మరింత పేరు తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటున్నా.

ప్రేమతో... నీ అభిమాని అమల " అని లేఖలో పేర్కొన్నారు నాగార్జున భార్య అమల.

అమల ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details