అల్లుఅర్జున్ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గురువారం.. 'పుష్ప' సినిమాలోని ఆయన లుక్కు సంబంధించిన ఓ పోస్టర్ను ఐకానిక్ స్టార్ పేరుతో విడుదల చేసింది చిత్రబృందం. ఇది అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.
ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా.. పల్లెటూరి అమ్మాయిగా రష్మిక కనిపించనుంది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్నారు. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.