తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బన్నీ-ప్రశాంత్‌ల చిత్రం అప్పుడే! - Alluarjun

వచ్చే ఏడాది జనవరిలో ప్రశాంత్​ నీల్​-అల్లు అర్జున్​ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

bunny
బన్న-ప్రశాంత్‌

By

Published : Apr 24, 2021, 6:59 PM IST

అల్లు అర్జున్‌ ప్రేమకథా చిత్రాలతో పాటు మాస్‌ యాక్షన్‌ చిత్రాల్లోనూ మెప్పించగలడు. ప్రస్తుతం ఆయన సుకుమార్‌ దర్శకత్వంలో 'పుష్ప' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఎర్రచందనం స్మగర్‌గా కనిపించనున్నాడు. రష్మక మందన కథానాయికగా నటిస్తోంది. సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం తర్వాత 'కేజీయఫ్‌' దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తోన్నాయి.

ప్రశాంత్‌ ప్రస్తుతం 'కె.జి.ఎఫ్‌2'తో పాటు ప్రభాస్‌తో కలిసి 'సలార్‌'న తెరకెక్కిస్తున్నారు. చిత్రం ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసే పనిలో ఉన్నారట. ఆ వెంటనే జనవరిలోనే అల్లు సినిమాను ప్రశాంత్‌ పట్టాలెక్కించేందుకు సన్నహాలు చేస్తున్నారట. ఆ మధ్య ప్రశాంత్ నీల్ హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అల్లు అర్జున్‌ను కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతుందని వార్తలు గుప్పుమన్నాయి.

ఇక అల్లు అర్జున్‌ - కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. కానీ, అది తాత్కాలికంగా వాయిదా పడింది. ఇక ‘వకీల్‌సాబ్‌’ దర్శకుడు వేణు శ్రీరామ్‌తో 'ఐకాన్' చేస్తున్నట్లు గతేడాదిలో ప్రకటించారు. కానీ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇటీవల ఈ సినిమాను ప్రారంభించనున్నట్లు దిల్‌రాజు మీడియా ముందే ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details