ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి(Allu arjun wife) ఓ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 60 లక్షల మంది ఫాలోవర్లను ఆమె సంపాదించుకున్నారు. ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ రోజుల్లోనే... ఇంతటి సంఖ్యలో ఫాలోవర్లను ఆమె సంపాదించుకోవడం విశేషం. ఇతర నటుల భార్యల కంటే.. ఎక్కువ మంది ఫాలోవర్లు స్నేహకు ఉన్నారు.
స్నేహా రెడ్డి(Allu arjun wife) తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తమ పిల్లలు అయాన్, అర్హ ఫొటోలతో పాటు తన భర్త అల్లు అర్జున్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటారు. మీడియాకు దూరంగా ఉన్నా.. కుటుంబంలోని (Allu Arjun Family) సంతోషాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవల దీపావళి వేడుకలు, హలోవీన్ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేశారు.