ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యంలో సినీ హీరో అల్లు అర్జున్ సందడి చేశారు. సినిమా షూటింగ్ నిమిత్తం ఆదిలాబాద్ జిల్లాకు శనివారం వచ్చిన ఆయన కుంటాల జలపాతం వద్ద షూటింగ్ ముగించుకుని ఈ రోజు మిగిలిన షూటింగ్ కోసం మహారాష్ట్ర వెళ్లారు.
కుంటాల జలపాతం వద్ద స్టైలిష్‌స్టార్ సందడి...
ఆదిలాబాద్-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన తిప్పేశ్వర్ అభయారణ్యంలో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. కుంటాల జలపాతం వద్ద షూటింగ్ ముగించుకుని వెళ్తున్న హీరోను చూసేందుకు అభిమానులు పోటెత్తారు.
కుంటాల జలపాతం వద్ద స్టైలిష్‌స్టార్ సందడి...
అభిమానుల ఆసక్తి..
ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి వెళ్లి తమ అభిమాన హీరోను చూసి కేరింతలు కొట్టారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపగా.. తన వాహనం నుంచి వారికి అభివాదం చేస్తూ షూటింగ్‌కి వెళ్లిపోయారు స్టైలిష్‌స్టార్.