తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వారి జీవితమే బాగుందన్న బన్నీ - బన్నీ

తన కంటే తన సిబ్బంది జీవితమే ప్రశాంతంగా ఉందని అన్నాడు హీరో అల్లు అర్జున్. వారు పార్టీ చేసుకున్న ఫొటోను తన ఇన్​స్టాలో పోస్ట్​ చేసి.. నన్నూ పిలవొచ్చు కదయ్యా అంటూ చమత్కరించాడు.

వారి జీవితమే బాగుందన్న బన్నీ

By

Published : Jul 7, 2019, 7:03 PM IST

హీరోల లైఫ్ వేరు.. ఎప్పుడు ఎంజాయ్‌ చేస్తూనే ఉంటారు అనుకుంటాం. కానీ అల్లు అర్జున్‌ మాత్రం తన కంటే తన సిబ్బంది జీవితం ఎంతో బావుందని అంటున్నాడు. ఎందుకంటే.. బన్నీ స్టాఫ్‌లోని సభ్యుడు శరత్‌చంద్ర నాయుడు శనివారం సహచరులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. అనంతరం ఆ ఫోటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దీన్ని చమత్కరిస్తూ తన ఇన్​స్టాలో పోస్టు చేశాడీ కథానాయకుడు.

'ఆదివారం ఉదయాన్నే నాకు కనిపించే దృశ్యం ఏంటంటే.. మీరు శనివారం రాత్రి పార్టీ చేసుకుని ఇలా ఫోటోలు దిగడం. రాత్రి వేళల్లో మీరు చేసే ఎంజాయ్‌ నేను చేయలేకపోతున్నాను. నా కంటే మీ జీవితం ప్రశాంతంగా ఉందనిపిస్తుంది. నన్నూ పిలవొచ్చు కదయ్యా.' -ఇన్​స్టాలో అల్లు అర్జున్

ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు హీరో అల్లు అర్జున్. హైదరాబాద్​లో చిత్రీకరణ జరుపుకుంటోంది. పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుందీ చిత్రం.

ఇది చదవండి: త్వరలో నటనకు సమంత గుడ్​బై చెప్పనుందా..!

ABOUT THE AUTHOR

...view details