తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆందోళన వద్దు.. నేను కోలుకుంటున్నా: అల్లు అర్జున్ - టాలీవుడ్ కరోనా

తనకు ప్రస్తుతం స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నాయని, కోలుకుంటున్నానని హీరో అల్లు అర్జున్​ ట్వీట్ చేశారు. అభిమానులు ఆందోళన చెందొద్దని అన్నారు.

Allu arjun says he recovers from corona
అల్లు అర్జున్

By

Published : May 3, 2021, 4:48 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పారు. ఇప్పుడు స్వల్ప లక్షణాలే ఉన్నాయని, క్రమంగా కోలుకుంటున్నానని ట్వీట్ చేశారు. అభిమానులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఇంకా క్వారంటైన్​లోనే ఉన్నానని స్పష్టం చేశారు. తాను కోలుకోవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం బన్నీ 'పుష్ప' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో లారీ డ్రైవర్​గా కనిపించనున్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం.. ఎర్ర చందనం అక్రమా రవాణా నేపథ్య కథతో తీస్తున్నారు. రష్మిక హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ ఏడాది ఆగస్టు 13న థియేటర్లలోకి రానుంది.

ABOUT THE AUTHOR

...view details