Pushpa Movie Srivalli Song: ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా నుంచి 'శ్రీవల్లి' వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. విడుదలకు ముందే సినిమాకు ఎంతో క్రేజ్ తీసుకొచ్చిందీ పాట. 'సూపే బంగారమాయేనే..' అంటూ సాగే పాట యువతను ఉర్రూతలూగిస్తోంది. భాస్కరభట్ల అద్భుతమైన లిరిక్స్‌కు తోడు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్లు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి.
Pushpa Movie Srivalli Song: 'శ్రీవల్లి' వీడియో సాంగ్ వచ్చేసింది - శ్రీవల్లి సాంగ్
Pushpa Movie Srivalli Song: అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' నుంచి 'శ్రీవల్లి' వీడియో సాంగ్ విడుదలైంది. ఇప్పటికే సూపర్ హిట్టయిన ఈ పాట విజువల్స్ యమా ఆకట్టుకుంటున్నాయి.
srivalli song
గత డిసెంబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. బన్నీ గెటప్, నటన సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. సినిమాలోని మిగిలిన పాటలు కూడా బాగా ప్రేక్షకాదరణ పొందాయి. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రం మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలోని అన్ని పాటలు యూట్యూబ్ విడుదల చేసిన టాప్-100 గ్లోబల్ సాంగ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
ఇదీ చూడండి:టాప్-100 గ్లోబల్ సాంగ్స్‌లో 'పుష్ప'.. తగ్గేదే లే