ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం 'పుష్ప' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు గతంలో ప్రకటన వచ్చింది. అయితే ఇంతలో తారక్-కొరటాల శివ కాంబోలో సినిమా ఖరారవ్వడం వల్ల ఆ ప్రాజెక్టు ప్రారంభంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీరిద్దరు ఒప్పుకున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత అల్లుఅర్జున్, కొరటాల కాంబోలో చిత్రం తెరకెక్కించే అవకాశం ఉంది.
కొరటాల శివతో బన్నీ సినిమా ఎప్పుడంటే! - కొరటాల శివ ఆచార్య
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కొరటాల శివ చిత్రం ఖరారైన నేపథ్యంలో బన్నీతో రూపొందించాల్సిన సినిమాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌తో సినిమా తర్వాత వచ్చేఏడాది అల్లుఅర్జున్‌తో కొరటాల శివ సినిమా పట్టాలెక్కనుందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.
అయితే 'పుష్ప' తర్వాత 'ఐకాన్' సినిమాలో నటించేందుకు అల్లుఅర్జున్ మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఇటీవలే 'వకీల్‌సాబ్' చిత్రంతో హిట్ అందుకున్న వేణు శ్రీరామ్.. జులై ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. మరోవైపు 'ఆచార్య' సినిమాతో బిజీగా ఉన్న దర్శకుడు కొరటాల శివ.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో తారక్ సినిమాను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ, తారక్ సినిమాలు వచ్చే ఏడాది విడుదలకానున్న నేపథ్యంలో 2022లో బన్నీ, కొరటాల శివ కాంబినేషనలో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:13 ఏళ్ల తర్వాత పోటీపడనున్న రజనీ, కమల్!