'అల వైకుంఠపురములో' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ఈ మూవీకి భారీ కలెక్షన్లు రావడం వల్ల తన తదుపరి సినిమాకు బన్నీ రెమ్యునరేషన్ పెంచినట్లు సమాచారం.
హాట్‌టాపిక్‌గా మారిన అల్లు అర్జున్ రెమ్యునరేషన్!
'అల వైకుంఠపురములో' చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు అల్లు అర్జున్. అయితే తన తదుపరి సినిమాకు రెమ్యునరేషన్ భారీగా పెంచినట్లు సమాచారం.
బన్నీ
గతంలో అర్జున్ పారితోషికం 15కోట్ల వరకు ఉండగా తన కొత్త చిత్రం కోసం దానికి రెట్టింపు తీసుకోనున్నాడట. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రష్మిక మందాన హీరోయిన్. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ వాయిదాపడింది.