రచయితగా వెండితెరకు పరిచయమై 'పవర్', 'జై లవకుశ' వంటి చిత్రాలతో దర్శకుడిగానూ సత్తా చాటాడు కె.ఎస్.రవీంద్ర (బాబీ). ఇప్పుడు నిజ జీవిత మామా అల్లుళ్లు వెంకటేష్ - నాగచైతన్యలను 'వెంకీమామ' చిత్రంతో తెరపైకి తెచ్చి మరో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడీ ఉత్సాహంలోనే తన తదుపరి సినిమాపై దృష్టి సారించాడట బాబీ.
'వెంకీమామ' దర్శకుడి చూపు బన్నీ వైపు - బాబీ
'వెంకీమామ'తో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు బాబీ. తన తర్వాతి చిత్రం గురించి ఇప్పటికే సినీ వర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ డైరెక్టర్ అల్లు అర్జున్‌తో ఓ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడని తెలుస్తోంది.
బన్నీ
తాజాగా సినీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం ఇప్పుడీ యువ దర్శకుడి చూపు అల్లు అర్జున్‌పై పడిందట. ఇటీవలే బన్నీని కలిసిన ఈ దర్శకుడు తన స్టోరీ లైన్‌ను స్టైలిష్‌స్టార్‌కు వినిపించాడట. ఈ కథ అతడికి తెగ నచ్చినందున వచ్చే ఏడాదిలో ఈ సినిమాకు పట్టాలెక్కిద్దామని మాటిచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ క్రేజీ ప్రాజెక్టు వచ్చే ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
ఇవీ చూడండి.. తెలుగు 'పింక్'లో తెలుగమ్మాయి..?