ఒకరి వద్దకు వెళ్లిన కథలు పలు కారణాల వల్ల మరొక కథానాయకుడు దగ్గరకు వెళ్తుంటాయి. అల్లు అర్జున్, నితిన్ విషయంలో ఇదే జరిగింది. బన్నీ నటించాల్సిన ఓ ప్రేమకథలో నితిన్ నటించి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అది ఏ సినిమా అంటే? దర్శకుడు తేజ తెరకెక్కించిన 'జయం'.
బన్నీ నటించాల్సింది నితిన్ చేశాడు..
అల్లు అర్జున్ హీరోగా నటించాల్సిన చిత్రం ఒకటి నితిన్‌కు వెళ్లిపోయింది. ఆ సినిమా నితిన్ కెరీర్లో మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. అదేంటో చూద్దాం.
ఈ లవ్ స్టోరీ అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథ ఎంతగా ఆకట్టుకుందో ఇందులోని సంగీతం అదే స్థాయిలో అలరించింది. నాయకానాయికలు నితిన్, సదా యువత గుండెలో నిలిచిపోయారు. అసలు విషయం ఏంటంటే? బన్నీని తేజనే వెండితెరకు పరిచయం చేద్దామనుకున్నాడు. అన్నీ ఓకే అయ్యాయి. తర్వాత ఏమైందో తెలీదు కానీ, ఆ ప్రాజెక్టులోకి నితిన్‌ను తీసుకున్నాడు దర్శకుడు తేజ. ఈ అవకాశం మిస్ అవడం వల్ల రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'గంగోత్రి' చిత్రంతో పరిచయమయ్యాడు బన్నీ.
ఇవీ చూడండి.. ఆసక్తి కలిగిస్తోన్న 'దొంగ' సెకండ్ లుక్