తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయ్​కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బన్నీ - entertainment news

హీరో విజయ్ దేవరకొండకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇంతకీ ఆ మాటేంటి? బన్నీ ఏం నిలబెట్టుకున్నాడు?

విజయ్​కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బన్నీ
విజయ్ దేవరకొండ-అల్లు అర్జున్

By

Published : Feb 8, 2020, 5:02 PM IST

Updated : Feb 29, 2020, 3:49 PM IST

'అల వైకుంఠపురములో' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం.. కలెక్షన్లతో పాటు పలు రికార్డులను సొంతం చేసుకుంది. తాజాగా టాలీవుడ్‌ యువ హీరో విజయ్‌ దేవరకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.

ఇంతకీ ఆ మాట ఏమిటంటే... 'రౌడీ' బ్రాండ్‌ పేరుతో విజయ్‌ దేవరకొండ ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టాడు. అయితే ఒకానొక సందర్భంలో విజయ్‌ దేవరకొండ దుస్తులు చూసి 'నీ 'రౌడీ' వేర్‌ బాగుంది. మరి నాకెప్పుడు పంపిస్తున్నావ్‌' అని బన్నీ సరదాగా అడిగారట. దీంతో విజయ్‌.. 'నేనే స్పెషల్‌గా డిజైన్‌ చేసి మీకోసం పంపిస్తాను అన్నా' అని చెప్పారట. ఈ మేరకు 'అల వైకుంఠపురములో' విడుదల రోజు విజయ్‌.. బన్నీ కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసి రెండు 'రౌడీ' టీషర్ట్స్‌ పంపించారు. ఆ ఫొటోలను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన బన్నీ.. 'థ్యాంక్యూ విజయ్‌. మాటిచ్చినట్లుగానే నాకోసం నువ్వే ప్రత్యేకంగా దుస్తులు డిజైన్‌ చేసి పంపించినందుకు ధన్యవాదాలు‌. తప్పకుండా వీటిని ధరిస్తాను.' అని ఆ సమయంలో మాట ఇచ్చాడు.

రౌడీ వేర్ టీషర్ట్స్

ఇటీవలే బన్నీ.. తన కుటుంబసభ్యులు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతికి వెళ్లే సమయంలో విజయ్ దేవరకొండ ఇచ్చిన పసుపు, నలుపు రంగులో ఉన్న టీ షర్ట్‌ను ధరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. 'విజయ్‌కు ఇచ్చిన మాటను బన్నీ నిలబెట్టుకున్నారు.', 'రౌడీ వేర్‌లో బన్నీ' అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

రౌడీ వేర్​లో అల్లు అర్జున్
కుటుంబసమేతంగా అల్లుఅర్జున్
Last Updated : Feb 29, 2020, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details