విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంతో నిర్మాతగా తొలి అడుగులు వేస్తోన్న తన స్నేహితుడు కేదార్ సెలగంశెట్టిని అల్లు అర్జున్ అభినందించాడు. ఈ మేరకు కేదార్‌ను శుక్రవారం ఉదయం తన నివాసానికి ఆహ్వానించాడు. నిర్మాతగా కేదార్ ఎన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షించాడు. అనంతరం అతడికి ఓ మొక్కను బహుమతిగా అందించాడు.
'పలాస' దర్శకుడికి బన్నీ అభినందన - పలాస దర్శకుడికి బన్నీ అభినందన
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్నేహితుడైన కేదార్ సెలగంశెట్టి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సుకుమార్ దర్శకుడు. తాజాగా కేదార్‌ను ఇంటికి ఆహ్వానించిన బన్నీ అతడికి శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే 'పలాస 1978' చిత్ర దర్శకుడు కరుణ కుమార్‌ను కూడా బన్నీ అభినందించాడు.
ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన 'పలాస 1978' చిత్రం తనకెంతగానో నచ్చిందని బన్నీ తెలిపాడు. ఆ చిత్ర దర్శకుడు కరుణ కుమార్‌ని కూడా ప్రశంసించాడు. శుక్రవారం తన నివాసానికి ఆహ్వానించి అభినందనలు తెలిపాడు. దీనికి సంబంధించిన ఫొటోని బన్నీ ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.
"తాజాగా నేను 'పలాస 1978' చిత్రాన్ని వీక్షించా. ఈ సినిమా నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చింది. అందుకే చిత్ర దర్శకుడు కరుణ కుమార్‌ని కలిసి అభినందించా. గొప్ప సందేశంతో మంచి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎన్నో మంచి విషయాలున్నాయి. టాలెంట్ ఉన్న నూతన దర్శకులు, నటీనటులు తెలుగు పరిశ్రమలోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది. చిత్రబృందం మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని బన్నీ పేర్కొన్నాడు.