తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఈటీవీ వల్లే నాకు 'అఖండ'లో అవకాశం' - అఖండ విలన్​ శ్రీకాంత్​

Alitho Saradaga Actors Srikanth and Poorna: 'అఖండ' సినిమాలో విలన్​గా శ్రీకాంత్​, కీలక పాత్రలో పూర్ణ నటించి ప్రేక్షకుల మన్నలను పొందారు. తాజగాా ఈ ఇద్దరూ కలిసి ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొని తమ కెరీర్‌ గురించి ఎన్నో ఆసక్తికర సంగతులను చెప్పారు. ఇందులో భాగంగా 'అఖండ'లో తమకు అవకాశం ఎలా వచ్చిందో వివరించారు.

అఖండ శ్రీకాంత్​ పూర్ణ, alitho saradaga srikanth poorna
అఖండ శ్రీకాంత్​ పూర్ణ

By

Published : Dec 14, 2021, 10:42 AM IST

Alitho Saradaga Actors Srikanth and Poorna: 'శ్రీ మహాలక్ష్మి' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. 'అవును', 'సీమ టపాకాయ్‌' వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళీ ముద్దుగుమ్మ పూర్ణ. ఇటీవల ఆమె బాలకృష్ణ 'అఖండ'లో పద్మావతి పాత్రలో కనిపించి ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నారు. అయితే ఈ అవకాశం తనకు ప్రముఖ ఛానల్​ ఈటీవీ వల్ల వచ్చినట్లు తెలిపారు.

"సడన్​గా ఓ కాల్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఈటీవీకి చాలా పెద్ద థ్యాంక్స్​ చెప్పాలి. ఈ ఛానల్​ ద్వారానే కాల్​ వచ్చింది. ఎందుకంటే నా నెంబరు ఎవరికి దొరకట్లేదు. ఎలాగో అలా ఓ కాల్​ వచ్చింది. బోయపాటితో గతంలో పదేళ్ల క్రితమే సినిమా చేయాలి. కానీ కుదరలేదు! ఓ మంచి కారెక్టర్​ ఉంది. హీరోయిన్​గా ఉన్న మీరు ఇది చేస్తారా? అని అడిగారు. 'మీతో బాలకృష్ణతో కలిసి పనిచేయడాన్ని గొప్పగా భావిస్తాను' అని అన్నాను. అప్పడు పద్మావతి రోల్​ గురించి చెప్పారు. 'పద్మావతి ఏడిస్తే ప్రేక్షకులకు కన్నీరు రావాలి' అని చెప్పారు. వారిద్దరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. హీరోయిన్​గా అన్ని భాషల్లో కలిపి 35 సినిమాలు చేశాను. తొలిసారి 2004లో ఫ్రెండ్​ క్యారెక్టర్​ చేశాను. స్కేటింగ్​ భరత నాట్యంలో నేను గోల్డ్​ మెడలిస్ట్​. అందుకే సినిమాల్లోకి వచ్చాను. నేను క్లాసికల్​ డ్యాన్సర్​ కూడా. చిన్నప్పుడు నుంచి డ్యాన్స్​ అంటే పిచ్చి. మా అమ్మకు నేను సినిమాల్లో ఉండాలనేది కోరిక. నేను ఓ ముస్లిం అమ్మాయిని. మాకు నిబంధనలు చాలా ఉంటాయి. కానీ నేను బయటకు వచ్చి డ్యాన్స్​ నేర్చుకున్నాను. ఆ సమయంలో మా ఊరు నుంచి నేనొక్కదాన్నే ఇలా బయటకి వచ్చి నేర్చుకున్నా. అలా ఓ మలయాళం దర్శకుడి ద్వారా సినిమాల్లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత గ్యాప్​ ఇచ్చి చదువుకున్నా. మళ్లీ ఆ దర్శకుడే నాకు మరో ఛాన్స్​ కూడా ఇచ్చారు. సిస్టర్​ రోల్​ చేశాను. అనంతరం ఫ్రెండ్స్​, సిస్టర్స్​ రోల్చ్​ చేయడం మానేశాను. అప్పటినుంచి హీరోయిన్​గా మాత్రమే చేస్తున్నా" అని పూర్ణ చెప్పారు.

ఇక 'అఖండ' సినిమాలో వరదరాజులుగా శ్రీకాంత్‌ తన నటనతో అందర్నీ భయపెట్టేశారు. ఈయన కూడా పూర్ణతో కలిసి ఆలీతో సరదాగాలో సందడి చేశారు. తనకు ఈ అవకాశం ఎలా వచ్చిందో వివరించారు. "బాలకృష్ణ సినిమాలో విలన్​ అనగానే షాక్​ అయ్యా. ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అని భయపడ్డా. ఒక్కో సందర్భంలో ఈ క్యారెక్టర్​ మనకు సెట్​ అవ్వకపోతే విమర్శలు వస్తాయి, తప్పుకుందాం అని కూడా అనుకున్నా. కానీ ఆ తర్వాత గెటప్​ సెట్​ అయ్యాక నాపై నాకు కాన్ఫిడెన్స్​ వచ్చింది" అని అన్నారు.

కలెక్షన్లతో దూసుకుపోతున్న 'అఖండ'

'సింహ', 'లెజెండ్'​ తర్వాత బోయపాటి-బాలయ్య కాంబోలో వచ్చిన హ్యాట్రిక్​ సినిమా 'అఖండ'. ఈ చిత్రం విడుదలై రెండు వారాలు అవతున్న ఇంకా థియేటర్లు ఫుల్​ అవుతున్నాయి. కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్​ వద్ద రికార్డులను సృష్టిస్తోంది. విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. ఇక ఈ మూవీలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించారు. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రల్లో కనిపించారు. తమన్ సంగీతమందించగా, మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.

ఇదీ చూడండి: బాక్సాఫీస్​పై బాలయ్య సింహగర్జన.. 'అఖండ' @రూ.100కోట్లు!

ABOUT THE AUTHOR

...view details