తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్'​ నుంచి ఆలియా ఔట్​.. హాలీవుడ్ నటితో చిత్రీకరణ! - jr.ntr

'ఆర్.​ఆర్.​ఆర్​'ను వదిలేసి వెళ్లిపోయిందట ఆలియా భట్. రామ్​చరణ్​కు జోడీగా ఈ బాలీవుడ్ హీరోయిన్​ను ఎంపిక చేశారు. హాలీవుడ్ నటి ఒలివియా మోరీస్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సన్నివేశాలను త్వరలో తెరకెక్కించనున్నారు.

alia out from rrr movie.. grand sed off from team
ఆర్ఆర్​ఆర్​

By

Published : Nov 28, 2019, 7:22 PM IST

ఆలియా భట్‌ 'ఆర్‌.ఆర్‌.ఆర్'​ను వదిలి వెళ్లిపోయిందట. రాజమౌళినే స్వయంగా ఆమెను దగ్గరుండి సంతోషంగా సాగనంపారట. అదేంటి.. ఆలియా సినిమా నుంచి తప్పుకుంటే జక్కన్న ఆనందంగా పంపడమేమిటని అనుకుంటున్నారా! ఈ సినిమాలో ఆలియాకు సంబంధించిన పాత్ర చిత్రీకరణ పూర్తయిందట. అందుకే చిత్ర బృందం ఆమెకు ఘనంగా వీడ్కోలిచ్చినట్లు తెలుస్తోంది.

ఇందులో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్​చరణ్​కు జోడీగా ఆలియాను తీసుకుంది చిత్రంబృందం. సినిమాలో ఆమెది తక్కువ నిడివి ఉన్న పాత్రే అయినప్పటికీ ఎంతో ప్రాధాన్యముంటుందని సమాచారం.

కొమురం భీమ్​గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా.. తారక్​ సరనస హాలీవుడ్ నటి ఒలివియా మోరీస్​ కనిపించనుంది. త్వరలో వీరిద్దరి సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అనంతరం క్లైమాక్స్ సీన్​ను తెరకెక్కిస్తారని సమాచారం.

దాదాపు రూ.350 కోట్లకు పైగా బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం.. ఇప్పటికే 70శాతం పైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.

ఇదీ చదవండి: అల్లుడు శీనుతో 'ఇస్మార్ట్ భామ' రొమాన్స్​..!

ABOUT THE AUTHOR

...view details