బాలీవుడ్లో రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ తొలిసారిగా కలిసి నటిస్తోన్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కథానాయకుడు రణ్‌బీర్ గురించి ఆలియా ఈ విధంగా స్పందించింది.
"రణ్‌బీర్‌ను ప్రేమించేది ఒక వ్యక్తిగా కాదు. అతనొక మంచి వైవిధ్యభరితమైన నటుడు. అందరిలాగే నాకు అతనితో కలిసి పనిచేయాలనే తపన ఉంటుంది. అతడి నటనలో దీక్ష, పట్టుదల, అంకితభావం ఇలా అన్ని లక్షణాలు కలిసి ఉంటాయి. నటనలో నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి రణ్‌బీర్ నుంచి ఎంతో నేర్చుకున్నా. ఇకపై ఎల్లప్పుడూ అతనినే అనుసరిస్తూ ఉంటా. నేను రణ్‌బీర్‌తో కలిసి ఐదు సంవత్సరాల కిత్రమే పనిచేయాల్సి ఉంది. కానీ కుదరలేదు, ఆ చిత్రమే ‘'యే జవానీ హై దివానీ’'. ఈ సినిమాకు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఇప్పుడు నేనూ, రణ్‌బీర్ కలిసి చేస్తున్న ‘'బ్రహ్మాస్త’'కు దర్శకత్వం అయాన్ ముఖర్జీనే. అందుకే అయాన్‌కు రుణపడి ఉన్నాను. ఈ చిత్రంలో మా ఇద్దరి మధ్య జరిగిన అందమైన కెమిస్ట్రీ ఎలా ఉంటుందో తెరపై చూడవచ్చు"
-ఆలియా భట్, బాలీవుడ్ నటి