సినీపరిశ్రమకు చెందిన కుటుంబం నుంచి వచ్చిన ఆలియా భట్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో అలరించే ఈ భామ నటనలో ఏ మాత్రం కుటుంబానికి తీసిపోనని నిరూపించుకుంది. తాజాగా ఈ అమ్మడు 2008లో చీరకట్టులో తీసుకున్న ఓ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
నీనా గుప్తా వివాహంలో
నీనా గుప్తా వివాహం 2008లో జరిగింది. ఈ వేడుకకు తల్లి సోని రజ్దాన్తో హాజరైన ఆలియా అచ్చమైన తెలుగమ్మాయిలా చీరకట్టులో కనువిందు చేసింది. ప్రస్తుతం ఆ ఫొటో వైరల్ అవుతోంది. అందులో ఆలియా మేకప్ లేకుండా దర్శనమిస్తోంది. ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా ఉండే చీరను కట్టుకుంది. ఆ వయసులోనే చీరకట్టు బాగా అలవాటు ఉన్నట్లు తిరిగింది ఆలియా.