తెలంగాణ

telangana

By

Published : Apr 8, 2021, 6:26 PM IST

Updated : Apr 8, 2021, 6:49 PM IST

ETV Bharat / sitara

'వకీల్​సాబ్' పవన్​కు 'గంగూబాయ్' స్పెషల్ విషెస్

'వకీల్​సాబ్'​ విడుదల సందర్భంగా పవన్​తో పాటు చిత్రబృందానికి హీరోయిన్​ ఆలియా భట్ 'ఆల్ ది బెస్ట్'​ చెప్పింది. సినిమా విజయవంతం కావాలని కోరుతూ, ఓ వీడియోను రిలీజ్ చేసింది.

pawankalyan
పవన్​కల్యాణ్​

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ నటించిన 'వకీల్​సాబ్' చిత్రం ఏప్రిల్​ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ ఆలియా భట్​.. పవన్​ సహా 'వకీల్​సాబ్'​ చిత్రబృందానికి ​శుభాకాంక్షలు తెలిపింది. ఈ సినిమా విజయవంతం కావాలని ఆశిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో ఆమె తెలుగులో మాట్లాడి, అభిమానులను ఆశ్చర్యపరిచింది.

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తాను నటించిన 'గంగూబాయ్​ కతియావాడి' తెలుగు టీజర్​ను 'వకీల్​సాబ్​'తో పాటు థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆలియా ఈ చిత్రంతో పాటు 'ఆర్​ఆర్​ఆర్​', 'బ్రహ్మస్త్ర'లోనూ నటిస్తోంది.

ఇదీ చూడండి: గంగూబాయ్​ వివాదం: ఆలియా, భన్సాలీకి సమన్లు

Last Updated : Apr 8, 2021, 6:49 PM IST

ABOUT THE AUTHOR

...view details