తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మా ప్రియమైన సీతకు స్వాగతం: ఆర్ఆర్ఆర్ - ఆర్ఆర్ఆర్ సెట్లో ఆలియా భట్

మెగా పవర్​స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్​గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా సెట్లో అడుగుపెట్టింది ఆలియా. తనకు స్వాగతం చెబుతూ కొన్ని ఫొటోలను నెట్టింట షేర్ చేసింది 'ఆర్ఆర్ఆర్' చిత్రయూనిట్.

Alia Bhatt recommences shooting for movie 'RRR'
మా ప్రియమైన సీతకు స్వాగతం: ఆర్ఆర్ఆర్

By

Published : Dec 7, 2020, 12:49 PM IST

మెగా పవర్​స్టార్ రామ్‌చరణ్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కథానాయకులుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'‌. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మహబలేశ్వరంలో జరుగుతోంది. తాజాగా ఈ సెట్లో అడుగుపెట్టింది నటి ఆలియా భట్. ఈ విషయాన్ని తెలియజేస్తూ 'ఆర్ఆర్ఆర్' యూనిట్ ఆమెకు స్వాగతం పలికింది. ప్రస్తుతం ఆలియా, రాజమౌళితో దిగిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

రాజమౌళితో ఆలియా

కరోనా కారణంగా వాయిదా పడిన షూటింగ్ ఇటీవలే ప్రారంభమై శరవేగంగా కొనసాగుతోంది.ఈ సినిమాలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా కనిపించనుండగా, తారక్.. కొమురం భీమ్​గా అలరించనున్నారు. హాలీవుడ్ నటి ఒలివియా.. తారక్ సరసన నటిస్తోంది. అజయ్ దేవగణ్, శ్రియ కీలకపాత్రల్లో మెప్పించనున్నారు.

రాజమౌళితో ఆలియా

ABOUT THE AUTHOR

...view details