విజయదశమి సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు దేవాలయాల బాట పట్టారు. దుర్గాపూజ చేసి అమ్మవారిని ప్రార్థించారు. హృతిక్ రోషన్, రాణీ ముఖర్జి, అలియా భట్ తదితరులు ఉత్తర ముంబయిలో దుర్గామాతను దర్శించుకున్నారు.
దుర్గామాతకు బాలీవుడ్ తారల ప్రత్యేక పూజలు - దుర్గామాతను సందర్శించిన హృతిక్
దసరా నవరాత్రుల సందర్భంగా ఉత్తర ముంబయిలో ప్రముఖ దర్శకుడు నిర్వహిస్తున్న పండాల్‌ను పలువురు బాలీవుడ్ తారలు సందర్శించారు. దుర్గామాతను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
హృతిక్ రోషన్
దర్శకుడు అయన్ ముఖర్జి నిర్వహిస్తున్న పండాల్‌ను దర్శించిన సినీతారలు దుర్గామాతకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాజోల్‌తో పాటు ఆమె తల్లి తనూజ దుర్గాదేవిని దర్శించుకున్నారు.
ఇదీ చదవండి: వెండితెరపై సందడికై కుర్రహీరోలు సిద్ధం!