తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ వార్తలు అవాస్తవం: ఆలియా భట్​ - అలియా భట్​ గంగూభాయ్​

తనకు గాయమైందని వస్తున్న వార్తలు నిజం కాదని తేల్చింది బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్​. పెద్ద పెద్ద ఆర్టికల్స్​ రాసేముందు, కొంచెం అడిగి తెలుసుకోండని వారిపై సెటైర్​ వేసింది.

Alia Bhatt not hurt on Gangubai Kathiawadi set. It is an old injury, actress clarifies
ఆ వార్తలు అవాస్తవం: ఆలియా భట్​

By

Published : Jan 22, 2020, 10:08 AM IST

Updated : Feb 17, 2020, 11:11 PM IST

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్..​​ ప్రముఖ దర్శకుడు సంజయ్​లీలా భన్సాలీ దర్శకత్వంలో 'గంగూబాయి కతియావాడి' సినిమాలో నటిస్తోంది. అయితే చిత్రీకరణలో ఆమెకు గాయమైందనే వార్త కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ విషయం గురించి మాట్లాడిందీ భామ.

"గంగూబాయి కతియావాడి' సినిమా షూటింగ్​లో ఎలాంటి గాయం కాలేదు. మీరు చూసిన చిన్న గాయం.. నేను ఇంట్లో ఉండగా తగిలింది. నా గురించి పెద్ద పెద్ద ఆర్టికల్స్​ రాసే ముందు కొంచెం అడిగి తెలుసుకోండి"

- ఆలియా భట్​, హీరోయిన్

ఒకప్పటి ముంబయి మాఫియాలో లేడీ డాన్​గా ఉన్న గంగూబాయి జీవితం ఆధారంగా ఈ చిత్రం తీస్తున్నారు. ఈమె పాత్రలోనే కనిపించనుంది ఆలియా. ఇటీవలే విడుదలైన ఫస్ట్​లుక్​ ఆకట్టుకుంటోంది.

ఆ వార్తలు అవాస్తవం: ఆలియా భట్​

ప్రస్తుతం ఆలియా.. తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్​ఆర్​ఆర్​'లో నటిస్తోంది. అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ పక్కన సీతగా కనిపించనుంది. కరణ్​ జోహార్​ నిర్మిస్తున్న భారీ బడ్జెట్​ సినిమా 'బ్రహ్మాస్త్ర'లో హీరోయిన్​గా నటిస్తోంది.

ఇదీ చదవండి: ముందు రక్షకుడు.. ఆ తర్వాత వస్తున్న రాక్షసుడు

Last Updated : Feb 17, 2020, 11:11 PM IST

ABOUT THE AUTHOR

...view details