తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పాపం ఆలియా.. అవకాశాలు వదిలేసిందా! - ఆలియా భట్

బాలీవుడ్​ సొట్ట బుగ్గల సుందరి ఆలియా భట్​ ఓ ఖాన్​ సినిమాలో నటించడానికి అంగీకరించి, మరో ఖాన్​కు నో చెప్పింది. ప్రస్తుతం రెండు అవకాశాలు వదులుకొని బాధ పడుతుందట.

ఆలియా భట్​

By

Published : Aug 31, 2019, 5:53 PM IST

Updated : Sep 28, 2019, 11:48 PM IST

అందాల ఆలియా ప్రస్తుతం బాధలో ఉందట.. కారణం ఇద్దరు ఖాన్​లతో సినిమాలు చేతి వరకూ వచ్చి జారిపోవడమే. అసలు విషయం ఏంటంటే.. సల్మాన్​ఖాన్​ హీరోగా రాబోయే 'ఇన్షాల్లా'లో ఆలియాను నాయికగా ఎంపికచేశారు. సంజయ్​లీలా భన్సాలీ దర్శకత్వం వహించబోయే ఈ చిత్రానికి అడగగానే తన కాల్షీట్లన్నీ ఇచ్చేసిందట ఆలియా. ఆ సమయంలోనే ఆమీర్​ ఖాన్​తో ఓ సినిమా చేయడానికి అవకాశం వచ్చిందట. అయితే, డేట్స్​ కుదరక ఈ అవకాశం వదిలేసిందీ భామ.

భారీ బడ్జెట్​తో నిర్మించాల్సిన 'ఇన్షాల్లా' ఇప్పట్లో సెట్స్​పైకి వెళ్లే అవకాశం లేదంటూ చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది. ఫలితంగా ఈ సినిమా’ ఆగిపోయినట్లే అన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఆమీర్, సల్మాన్​ ఇద్దరి సినిమాలు ఆలియాకు దక్కనట్లే. ఇందుకు ఆలియా ఎంతో బాధ పడుతుందని సమాచారం.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్​ఆర్​ఆర్'​లో నటిస్తుందీ బాలీవుడ్​ భామ.

ఇదీ చూడండి: కరణ్​ పార్టీలో విమర్శలపై విక్కీ కౌశల్​ రియాక్షన్​

Last Updated : Sep 28, 2019, 11:48 PM IST

ABOUT THE AUTHOR

...view details