మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మహబలేశ్వరంలో జరుగుతోంది. తాజాగా ఈ సెట్లో అడుగుపెట్టింది నటి ఆలియా భట్. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. 'ఎట్టకేలకు 'ఆర్ఆర్ఆర్' షూటింగ్‌కు వెళుతున్నా' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ భామ ఈ చిత్రంలో చరణ్ సరసన కనిపించనుంది. కరోనా కారణంగా వాయిదా పడిన షూటింగ్ ఇటీవలే ప్రారంభమై శరవేగంగా కొనసాగుతోంది.
'ఆర్ఆర్ఆర్' సెట్లో ఆలియా భట్ - ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కు ఆలియా భట్
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. చరణ్ సరసన ఆలియా భట్ కనిపించనుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం సిద్ధమైంది ఆలియా.
'ఆర్ఆర్ఆర్' సెట్లో ఆలియా భట్
ఈ సినిమాలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా కనిపించనుండగా, తారక్.. కొమురం భీమ్‌గా అలరించనున్నారు. హాలీవుడ్ నటి ఒలివియా.. తారక్ సరసన నటిస్తోంది. అజయ్ దేవగణ్, శ్రియ కీలకపాత్రల్లో మెప్పించనున్నారు.