తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రౌడీ హీరోపై మనసు పారేసుకున్న ఆలియా - Alia Bhatt finds Vijay Deverakonda as the most glamorous actor

యువ హీరో విజయ్ దేవరకొండకు బాలీవుడ్​లో రోజురోజుకూ క్రేజ్ పెరిగిపోతుంది. హీరోయిన్లు కూడా విజయ్​కు ఫ్యాన్స్​గా మారిపోతున్నారు. తాజాగా ఆలియా భట్​ తన ఫేవరేట్ హీరో దేవరకొండ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Alia Bhat
విజయ్

By

Published : Dec 5, 2019, 3:02 PM IST

రౌడీ కథానాయకుడు విజయ్‌ దేవరకొండకు ఇటు దక్షిణాదిలోనే కాక అటు ఉత్తరాదిలోనూ మంచి క్రేజ్‌ ఉంది. ఇప్పటివరకు ఈ హీరో బాలీవుడ్‌లో ఒక్క సినిమా చేయనప్పటికీ అతడి క్రేజ్‌ మాత్రం అక్కడ ఆకాశమంత ఎత్తుకు చేరుకుంటోంది. ఈ అభిమానం అక్కడి సినీప్రియులకు మాత్రమే పరిమితం కాదు.. బాలీవుడ్‌లోని స్టార్‌ కథానాయికలు కూడా దేవరకొండ మత్తులో ఊగిపోతున్నారు.

విజయ్​తో కలిసి పనిచేసే అవకాశం కోసం జాన్వీ కపూర్‌, సారా అలీఖాన్ వంటి యువ తారకలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే దేవరకొండపై మనసు పారేసుకున్న బాలీవుడ్‌ కథానాయికల జాబితాలో ఇప్పుడు ఆలియా భట్‌ కూడా చేరిపోయింది. తాజాగా ఈ భామ ముంబయిలో జరిగిన ఫిలింఫేర్‌ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనగా అక్కడ ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది.

"2019లో మీ ఫేవరెట్‌ స్టార్‌ ఎవరు" అంటూ వేదికపైనున్న యాంకర్‌ ఆలియాను ప్రశ్నించగా.. ఆమె ఏ మాత్రం తడుముకోకుండా "నా దృష్టిలో విజయ్‌ దేవరకొండ మోస్ట్‌ గ్లామరస్‌ యాక్టర్‌" అని బదులిచ్చి బాలీవుడ్‌ సినీ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. ఏదేమైనా ఆలియా చెప్పిన దాన్ని బట్టి చూస్తే రౌడీతో చేసే అవకాశం రావాలే కానీ, ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేస్తుందని అర్థమైపోతుంది.

ఇవీ చూడండి.. ఆసియా రొమాంటిక్‌ పురుషుల జాబితాలో ప్రభాస్‌

ABOUT THE AUTHOR

...view details