Alia bhatt marriage date: 'గంగూబాయ్' ఆలియా భట్.. పెళ్లికి టైమ్ ఫిక్సయింది. ప్రియుడు, స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను ఈ ఏప్రిల్‌లో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో టీవీ నటీనటులతో పాటు పలువురు సినిమా స్టార్స్ ఏడడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలియా-రణ్‌బీర్ ఒక్కటికానున్నట్లు తెలుస్తోంది.
గత మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్న రణ్‌బీర్-ఆలియా.. చాలా సందర్భంగా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ వచ్చారు. ఇటీవల రణ్‌బీర్.. తన బెస్ట్ బాయ్‌ఫ్రెండ్ అంటూ ఆలియా ఇన్‌స్టాలో స్టోరీ కూడా పెట్టింది. అయితే మీడియాలో వస్తున్న కథానాల ప్రకారం.. ఏప్రిల్‌లో వీరి పెళ్లి చేసుకోనున్నారు. రాజస్థాన్‌లో రణ్తంబోరే దీనికి వేదిక కానుంది.