బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తోన్న 'పృథ్వీరాజ్' సినిమా చిత్రీకరణ పునఃప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు చంద్రప్రకాశ్ ద్వివేది స్పష్టం చేశారు. చిత్రీకరణ తిరిగి ప్రారంభమవ్వడం సంతోషంగా ఉందన్నారు.
అయితే అక్టోబర్ 10వ తేదీనే షూటింగ్ తిరిగి ప్రారంభించినట్లు చిత్రబృందానికి సంబంధించిన ఓ ప్రతినిధి తెలిపారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోన్న సోనూసూద్ కూడా షూటింగ్లో పాల్గొన్నట్లు చెప్పారు. కథానాయిక మానుషీ చిల్లర్ అక్టోబర్ 13నుంచి చిత్రీకరణలో పాల్గొననున్నట్లు.. సీనియర్ నటుడు సంజయ్ దత్త్ దీపావళి తర్వాత సెట్స్‌లో అడుగుపెట్టనున్నట్లు వెల్లడించారు.