బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన హారర్ కామెడీ సినిమా 'లక్ష్మీబాంబ్'. కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని.. దీపావళి కానుకగా నవంబరు 9న విడుదల చేయనున్న ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఇటీవలే ప్రకటించింది. అయితే ఈ టైటిల్ విషయంలో వివాదం జరగడం వల్ల టైటిల్ను మార్చి 'లక్ష్మి' అని పెట్టారు.
అక్షయ్ కుమార్ 'లక్ష్మీ బాంబ్' టైటిల్ మార్పు - అక్షయ్ కుమార్ వార్తలు
అక్షయ్ కుమార్ కొత్త సినిమా టైటిల్లో మార్పు చేస్తూ చిత్రబృందం నిర్ణయం తీసుకుంది. 'లక్ష్మి' పేరుతోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
'లక్ష్మీ బాంబ్' టైటిల్లో మార్పు చేసిన చిత్రబృందం!
దక్షిణాది సూపర్ హిట్ 'కాంచన'కు హిందీ రీమేక్ ఈ చిత్రం. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. అక్షయ్ సరసన కియారా అడ్వాణీ హీరోయిన్గా నటించింది.