తెలంగాణ

telangana

By

Published : Jun 6, 2019, 10:00 AM IST

Updated : Jun 6, 2019, 10:38 AM IST

ETV Bharat / sitara

హెలికాప్టర్​ పట్టుకొని వేలాడిన అక్షయ్​..!​

బాలీవుడ్ యాక్ష‌న్ హీరో అక్ష‌య్ కుమార్ మరోసారి తన విన్యాసాలతో అభిమానులను సర్​ప్రైజ్​ చేశాడు. ప్రస్తుతం తాను నటిస్తోన్న 'సూర్యవంశీ' చిత్రంలోని ఓ ఛేజింగ్​ సీన్ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు అక్షయ్.

హెలీకాప్టర్​ పట్టుకొని వేలాడిన అక్షయ్​కుమార్​

అక్షయ్​ కుమార్​ పోలీస్‌ పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'సూర్యవంశీ'. కత్రినా కైఫ్​ కథానాయిక. రోహిత్​ శెట్టి దర్శకుడు. ఈ సినిమాలోని ఓ యాక్షన్​ సీన్​లో భాగంగా హెలికాప్టర్​ నుంచి వేలాడుతూ స్టంట్స్​ చేశాడు అక్ష‌య్. త‌న ట్విట్ట‌ర్‌లో చిత్రీకరణ ఫోటోను పంచుకున్నాడు. ఫొటోతో పాటు చిన్న సందేశాన్ని రాశాడు.

సూర్యవంశీలో పోలీసుగా అక్షయ్​

" మామూలుగానే హెలికాప్టర్​ నుంచి వేలాడాను. 'సూర్యవంశీ' సెట్​లోని దృశ్యమిది. ఇలాంటి స్టంట్స్ అభిమానులు ఎవ‌రూ చేయ‌వద్దు. ఇవన్నీ నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చేసినవి".
-- అక్షయ్​ కుమార్​, సినీ హీరో

అక్ష‌య్ పోస్ట్ చేసిన ఆ ఫొటోలో వేగంగా వెళుతున్న హెలికాఫ్టర్ నుంచి కిందకి వేలాడుతూ... బైక్​పై వెళుతున్న విలన్​ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉంది. ఈ సినిమాను రోహిత్ శెట్టి - క‌ర‌ణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల 'కేసరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ స్టార్​ హీరో... ప్ర‌స్తుతం ల‌క్ష్మీ బాంబ్‌, మిషన్ మంగళ్, హౌస్​ఫుల్, గుడ్ న్యూస్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

Last Updated : Jun 6, 2019, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details