తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తమిళ దర్శకుడితో అక్కినేని యువహీరో..! - టాలీవుడ్ సినిమా వార్తలు

టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ ఓ తమిళ దర్శకుడితో సినిమా చేయనున్నాడని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది.

అఖిల్

By

Published : Nov 19, 2019, 9:01 AM IST

యువ కథానాయకుడు అఖిల్‌తో ఓ తమిళ దర్శకుడు సినిమా చేయబోతున్నాడా..! అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. దర్శకుడు మిత్రన్‌తో అఖిల్‌ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మిత్రన్‌ అఖిల్‌కు కథ వినిపించగా, కొన్ని మార్పులు సూచించాడని వినిపిస్తోంది. త్వరలోనే కథలో మార్పులు చేసి అఖిల్‌ను ఒప్పించేందుకు సిద్ధమవుతున్నాడట మిత్రన్‌.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయట. ప్రస్తుతం మిత్రన్‌ తమిళ నటుడు కార్తికేయన్‌తో 'హీరో' అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. అఖిల్‌ బొమ్మరిల్లు భాస్కర్‌ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇద్దరి సినిమాలు పూర్తైన తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిస్తారేమో చూడాలి.

ఇవీ చూడండి.. కోటి రూపాయల ఆఫర్​ తిరస్కరించిన సాయిపల్లవి!

ABOUT THE AUTHOR

...view details