Balayya akhanda tamil movie: 50 రోజులకుపైగా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల్ని అలరించిన బాలయ్య.. ఇప్పుడు తమిళనాడులోనూ సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. 'అఖండ' తమిళ డబ్బింగ్ వెర్షన్‌తో దుమ్మురేపేందుకు సిద్ధమవుతున్నారు. జనవరి 28న అంటే ఈ శుక్రవారమే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
కరోనా ప్రభావం వల్ల కొత్తగా తమిళ సినిమాలేవి థియేటర్లలోకి రావడం లేదు. చాలావరకు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే 'అఖండ'ను అక్కడి థియేటర్లలో రిలీజ్ చేయాలని పలువురు డిస్ట్రిబ్యూటర్స్ భావించారు. అందులో భాగంగానే డబ్బింగ్ వెర్షన్ రిలీజ్‌కు సిద్ధమయ్యారు.
ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోకి కూడా రావడం వల్ల తమిళ అభిమానులు కొందరు సబ్‌టైటిల్స్‌తో సినిమాను చూసేస్తున్నారు. ఇప్పుడు థియేటర్లలోకి తీసుకొస్తుండటం వల్ల వెండితెరపై బాలయ్య మేనియాను ఆస్వాదించనున్నారు.