సినీ కెరీర్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ కాలం కొనసాగుతున్నారన్నాడు హీరో అజయ్ దేవగణ్. 1990ల్లో తనతో పనిచేసిన టబు, కాజోల్ ఇప్పటికీ నటిస్తున్నారని తెలిపాడు. అజయ్ కొత్త చిత్రం 'దే దే ప్యార్ దే' ట్రైలర్ ఇవాళ విడుదలైంది.
'హీరోల కంటే హీరోయిన్లే ఎక్కువ రాణిస్తున్నారు' - సినిమా
ఈ రోజుల్లో సినీ రంగంలో హీరోల కంటే హీరోయిన్లే ఎక్కువ కాలం రాణిస్తున్నారని అజయ్ దేవగణ్ అభిప్రాయపడ్డాడు. ఈ రోజు అజయ్ 50వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త చిత్రం 'దే దే ప్యార్ దే' ట్రైలర్ విడుదలైంది.
అజయ్ దేవగణ్
"పదేళ్లలో సినీ పరిశ్రమలో చాలా మార్పులొచ్చాయి. పురుషులతో పోలిస్తే మహిళలే సినిమాల్లో ఎక్కువ కాలం కొనసాగుతున్నారు. ఇంతకు ముందు ఇద్దరి మధ్య తేడాలుండేవి. ప్రస్తుతం అలాంటి అంతరాలు లేవు. టబు, కాజోల్ లాంటి వాళ్లు ఇంకా నటిస్తూనే ఉన్నారు" - అజయ్ దేవగణ్, నటుడు