టాలీవుడ్ అగ్ర నటుడు చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' సినిమా విడుదలకు ముందే తన 152వ చిత్రం మొదలుపెట్టబోతున్నాడు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. కథానాయికగా నయనతార ఎంపికైనట్లు వార్తలు వెలువడినా ప్రస్తుతం ఆ పేరు మారినట్లు సమాచారం. బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్‌ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ సరసన ఐశ్వర్యా రాయ్..? - ishvarya roy
మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ నటించనున్నట్లు తెలుస్తోంది.
చిరు
చిరంజీవి సరసన ఇప్పటి వరకు నటించని హీరోయిన్ అయితే బావుంటుందనే ఉద్దేశంతోనే కథానాయికను మారుస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 2020 వేసవిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తుందీ చిత్ర బృందం.
ఇవీ చూడండి.. కురుక్షేత్ర: 'అర్జునుడి' పాత్రలో సోనూసూద్