తన తండ్రి కృష్ణరాజ్ రాయ్‌ను గుర్తు చేసుకుందిబాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్. ఆయన జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా బుధవారం ఐష్ ఓ పోస్ట్‌ను పెట్టింది. ‘మన డే ఆఫ్ స్మైల్స్.. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను నాన్న. హ్యాపీ బర్త్‌డే’ అని ఐష్ తెలిపింది. డే ఆఫ్ స్మైల్స్ సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులతో కలిసి ఐష్ తన తండ్రికి నివాళులర్పించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా ఆమె అభిమానులతో పంచుకుంది. మరోవైపు అభిషేక్ కూడా ఇన్‌స్టా వేదికగా కృష్ణరాజ్ రాయ్‌ను మిస్ అవుతున్నానంటూ పోస్ట్ పెట్టాడు.
మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం నాన్నా.. ఐశ్వర్య భావోద్వేగం - aishwaryarai bachchan father
డే ఆఫ్ స్మైల్స్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ పాల్గొంది. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తుచేసుకుని నివాళులర్పించింది.
గతేడాది విడుదలైన 'ఫ్యానీఖాన్' చిత్రంలో ఐష్ నటించింది. ప్రస్తుతం ఆమె మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనుంది. కల్కి రచించిన 'పొన్నియిన్ సెల్వన్' పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో ఐష్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మోహన్‌బాబు, కార్తీ, జయంరవి, విక్రమ్, కీర్తి సురేశ్, అమితాబ్‌బచ్చన్, అనుష్క నటించబోతున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి.. 'మందు తాగకపోతే చచ్చిపోతా 'అంటున్న కార్తికేయ